ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : ఎట్టకేలకు కల్వకుర్తి బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జి. జైపాల్ యాదవ్ కే వరించింది గత పది రోజులుగా కల్వకుర్తి నియోజకవర్గం లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు టికెట్ మాకంటే మాకే అని చర్చకు తెర లేపారు. తీరా ముఖ్యమంత్రి కేసీఆర్ కు జైపాల్ యాదవ్ ఎంత ఇష్టమో వేరేగా చెప్పనక్కర్లేదు. ఉద్యమం మొదటి రోజుల నుండి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో ఆయనకు ఉన్న అనుబంధం గొప్పదని కార్యకర్తలు అంటున్నారు. మరోసారి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై విశ్వాసం ఉంచి రెండవ సారి టికెట్టును కేటాయించడం విశేషం. కల్వకుర్తి అసెంబ్లీలో తిరుగులేని నేతగా అవతరించిన జైపాల్ యాదవ్ సైన్యానికి” పూర్తి మద్దతు ప్రకటించారు. టికెట్ల జాబితాలో కల్వకుర్తి ఎమ్మెల్యే పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే జైపాల్ కె టికెట్ వరించడంతో నియోజక వర్గంలో గులాబీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. నియోజక వర్గ సమీకరణాల నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ యాదవ్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయని భావించిన ముఖ్యమంత్రి మొదటి విడత లోనే పేరును ఖరారు చేశారు. ఇదే టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి టికెట్టు కోసం కసరత్తు చేశారు. అధిష్టానం పై ఆయన భరోసా పెట్టుకున్నారు. టికెట్ ఎట్టి పరిస్థితుల్లో 100% తనకే వస్తుందని సంకేతాలను ప్రజలకు. ఆయన వర్గీయులకు చేరవేశారు. అయినప్పటికీ అధినాయకుడు మాత్రం జైపాలుడికే పూర్తి ఆశీస్సులు అందజేశారు. నాలుగవ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న నాయకుడిగా జైపాల్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. ఇదే మాదిరిగా గతంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్ రెడ్డి ఈ నియోజక వర్గంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు జైపాల్ యాదవ్ కూడా ఆయన రికార్డును బ్రేక్ చేస్తారా లేదా వేచి చూడాల్సిందే. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం జైపాల్ యాదవ్ కు సహకరించేనా.?ఈ విషయం ఇలా ఉంటే కల్వకుర్తి నియోజకవర్గం లోని బిఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు గ్రూపులుగా ఏర్పడి ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా ఉంటున్నారు. టికెట్ ఆశించి బంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం బిఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న జైపాల్ యాదవ్ కు సహకరిస్తుందా..! లేదా అనే ప్రశ్న జైపాల్ యాదవ్ వర్గీయులకు అంతు పట్టడం లేదు.. ఈ విషయానికి కొస్తే రాష్ట్ర పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్టు ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల తలకొండపల్లి మండలానికి చెందిన జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గుప్తా తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తలకొండపల్లి మండలానికి చెందిన ఉప్పల వెంకటేష్, కసిరెడ్డి నారాయణరెడ్డి లా సొంత మండలం ఈ మండలంలో ఉన్న ఓటు బ్యాంకును టిఆర్ఎస్ పార్టీ తమ ఖాతాలో వేసుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక పోతే మిగిలిన మండలాలలో ప్రభుత్వ పథకాలు మంచి క్యాడర్ ఉన్న నాయకులు ఉండడంతో గెలుపు సునాయసమేనని పలువురు చర్చించుకుంటున్నారు. టికెట్ లభించక ముందు కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గంగా ముద్రపడ్డ పలువురు ముఖ్య నేతలు సీక్రెట్ గా సమావేశమై ఎమ్మెల్సీ నారాయణరెడ్డి లేదా వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతామని చర్చించుకున్నారు. ఒకవేళ అధిష్టానం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి లను బుజ్జగించి టిఆర్ఎస్ టికెట్ ఖరారు చేసినట్లు మరొక వాదన వినిపిస్తుంది.. ఇక పోతే టికెట్ ఖరారైన రోజు నుంచి వీరిద్దరూ కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తారా లేక ఎడమొహం పెడమోహం పెడతారా అనేది వేచి చూడాల్సింది. మాటలు కలుస్తున్నాయి కానీ మనసులు కలవడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే…



