కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన విజయోతవ ర్యాలీ బుధవారం కడ్తాల, మైసిగండి కర్కల్ పహాడ్, విటాయిపల్లి, ఆమనగల్లు, పెద్దాపూర్, వెల్దండ, మీదుగా కల్వకుర్తికి చేరుకుంది.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశీచంద్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపుపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవి దంపతులు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలిలో కొనసాగారు. అదేవిధంగా మైసిగండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ఆమనగల్లు చేరుకున్న ర్యాలీ ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి పొడవున వాహన శ్రేణి బైకులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, సూదిని రామ్ రెడ్డి, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, అనిత విజయ్, వస్పుల జంగయ్య, గుర్రం కేశవులు, మండ్లి రాములు, సత్యం, జగన్, యాట నర్సింహ, వర్కాల శ్రీను, కృష్ణా నాయక్, వస్పుల మానయ్య, వస్పుల శ్రీశైలం, శ్రీకాంత్, ఫరీద్, అలీం, కోట కృష్ణయ్య, మల్లయ్య, శివలింగం, మెకానిక్ బాబా, విజయ రాథోడ్, తాళ్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *