ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : ఒక్కసారి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కల్వకుర్తి నియోజకవర్గం రైల్వే లైన్ తీసుకొస్తానని బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల మండలం లోని అన్నెబోయన్, సుద్ధపల్లి, అసిరెడ్డిపల్లి, పల్లె తాండాల లో ప్రజలు ఆచారి కి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మాడుగుల మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. నేను మీ బిడ్డ ను మీ కోసం పని చేస్తా అంటూ, కేంద్రం ప్రభుత్వ హయాం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రైల్వే లైన్ తీసుకొస్తా




