ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కెఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా కోరారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి నిస్వార్ధంగా ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి మచ్చలేని నేతగా గుర్తింపు పొందినట్లు ఆయన తెలిపారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే కల్వకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మెకానిక్ బాబా ఆశాభవం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాస గృహంలో కేఎన్ఆర్ యువసేన జిల్లా నాయకులు తాళ్ల రవీందర్ పటేల్, విజయ్ రాథోడ్ తదితరులు కలిశారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి





