- ఎన్నికలను ఎదుర్కునే ఫార్మూలా అనుసరించండి
- ముమ్మాటికీ బిఆర్ఎస్ బిజెపికి బి టీమ్
- బిఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదు
- తెలంగాణ నేతలతో స్ట్రాటజీ వి•టింగ్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ
- రాష్ట్ర పార్టీలో ఎవరేమిటో నాకు పూర్తి అవగాహన ఉందని వెల్లడి
న్యూ దిల్లీ, జూన్ 27 : కర్నాటక తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కునే ఫార్ములాను రెడీ చేసుకోవాలని పార్టీ నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. మంగళవారం దిల్లీలో జరిగిన స్ట్రాటజీ కమిటీ వి•టింగ్‌లో రాహుల్ గాంధీ పూర్తిగా ఎన్నికలను ఎలా ఎదుర్కునాలి..ప్రజల ముందు ఎలాంటి అంశాలను పెట్టాలన్న అంశంపైనే ఎక్కువగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ధరణి రద్దు హావి• విషయంలో ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని.. ఆ హావి• గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. తెలంగాణలో సుదీర్ఘంగా పరిష్కారానికి నోచుకోని పోడు భూములు, అసైన్డ్ భూములు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వంటి అంశాలపైనా పార్టీ నేతల అభిప్రాయాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో పార్టీ టిక్కెట్ల అంశం పూర్తిగా కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చూసుకుంటుందని..టిక్కెట్ల అంశంపై ఒక్క నేత కూడా ఎలాంటి ప్రకటన చేయవద్దని రాహుల్ గాంధీ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తి స్వరాన్ని వినిపించేందుకు ప్రయత్నించి నట్లుగా తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎవర్నీ నోరు మెదపనీయలేదని అంటున్నారు. తమపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని స్ట్రాటజీ వి•టింగ్‌లో తేల్చుకుంటామని సమావేశానికి వెళ్లే ముందు వి•డియాతో కూడా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు నోరు మెదపలేకపోయారు. ఓ దశలో జగ్గారెడ్డి ఏదో మాట్లడటానికి ప్రయత్నించడంతో తెలంగాణ పార్టీలో ఎవరెవరు ఏమిటో తనకు పూర్తిగా తెలుసని ఏవి• చెప్పాల్సిన పని లేదని స్పందించినట్లుగా తెలుస్తుంది. మరో వైపు రేణుకా చౌదరి కూడా ఏఐసిసి సెక్రటరీగా ఉన్న నదీమ్ అనే నేతను తీసేయడంపై ప్రశ్నించారు.
కొన్ని కారణాల వల్ల తీసేశామని..దానిపై డిస్కషన్ అవసరం లేదని రాహుల్ చెప్పడంతో ఆమె కూడా సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో పొత్తుల విషయంలో రాహుల్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్తో పొత్తు అనే ప్రశ్నే ఉండదని తేల్చి చెప్పారు. జాతీయ స్థాయి విపక్షాల కూటమిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండబోదని చెప్పారు. బీజేపీతో కలిసి ఉందని..ఆ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. పార్టీలో పదవుల అంశంపైనా రాహుల్ సవి•క్షించారు. ఖాళీగా ఉన్న బూత్ ఇంచార్జ్‌లు..ఇతర పదవులను ఐదు రోజుల్లో భర్తీ చేయాలని పార్టీ నేతలకు రాహుల్ సూచించారు. వొచ్చే 120 రోజుల్లో ఏం చేయాలన్నది ముందుగానే డిసైడ్ చేసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని దిశానిర్దేశర చేశారు. రాహుల్ గాంధీతో సమావేశం పూర్తిగా పార్టీ పని తీరు, నేతల పనితీరుపైనే ప్రధానంగా జరిగింది.
కంప్లైంట్లు తీసుకోవడానికి దానిపై చర్చ పెట్టడానికి రాహుల్ ఆసక్తి చూపించలేదు. పైగా తనకు అందరి గురించి తెలుసని చెప్పడంతో.. కంప్లైంట్లతో వెళ్లిన నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు. ఇదిలావుంటే తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్ రావ్ థాక్రే తెలిపారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం నిర్వహించారు. అనంతరం మానిక్రావ్ వి•డియాతో మాట్లాడుతూ..100 శాతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగిందని..రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు కోపంగా ఉన్నారన్నారు. పదేళ్ల తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సిన అంశాలపై చర్చించామన్నారు. కాంగ్రెస్‌తో తెలంగాణ వికాస్ ఉంటుందని చెప్పారు. కేసీఆర్, బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీతో జత కడుతుందని తెలిపారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మానిక్రావ్ థాక్రే విమర్శలు గుప్పించారు.




