కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌మృతి

బెంగళూరు, ఫిబ్రవరి 20 : కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 6 గంటలకు జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్‌ ‌మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్‌ ‌బొమ్మై సంతాపం తెలిపారు.  భగవాన్‌ ‌మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని బొమ్మై ట్వీట్‌ ‌చేశారు.

జూలై 5, 1993లో జన్మించిన భగవాన్‌..  ’‌సంధ్యరాగ’ సినిమాతో దర్శకుడిగా మారారు. తన స్నేహితుడు దొరై రాజ్‌తో కలిసి 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు.  ఇందులో ఎక్కువ సినిమాల్లో రాజ్‌కుమార్‌ ‌హీరోగా నటించారు. ఈ జంట దొరై భగవాన్‌గా ఫేమస్‌ అయ్యారు. దొరై మరణంతో భగవాన్‌ ‌దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. భగవాన్‌  ‌మృతి పట్ల  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *