ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : కడ్తాల మండల కేంద్రంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో పాలసీతలీకరణ కేంద్రంలో ప్రతిష్టించిన గణనాధున్ని కడ్తాల మండల జడ్పిటిసి జర్పుల దశరథ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డిసిసిబి డైరెక్టర్, కడ్తాల ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణనాధుని ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమానికి గాను రూ. 25 వేలను గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జడ్పిటిసి దశరథ్ నాయక్ చేతుల మీదుగా యూత్ అధ్యక్షులు మహేష్ రెడ్డికి అందజేశారు. అదేవిధంగా సమాజంలో అందరూ భక్తి భావంతో మెలగాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, సమాజ శ్రేయస్సుకు అందరూ పాటుపడాలని జెడ్పిటిసి, చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో కడ్తాల మండల రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పెంటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆనంద్, రావిచెడ్ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్, సీనియర్ నాయకులు జాంగిర్ ఆలీ, చందోజి, వార్డు సభ్యులు బిక్షపతి, గురి గల రామచంద్రయ్య, హెచ్ ఆర్ మహేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు క్యామ వెంకటేష్, గ్రామ రైతు కోఆర్డినేటర్ మంగళపల్లి నరసింహ, మోహన్ సేటు, గ్రామ యూత్ అధ్యక్షులు కొప్పు కృష్ణ, కంబాలపల్లి రమేష్, జగన్, సురేష్, జగదీష్, హరీష్, కాలే శీను, రమేష్, తదితరులు పాల్గొన్నారు.




