ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : జాతీయ సంఘసంస్కర్త సామాజిక విప్లవ కారిని ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, కఢ్తాల మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిప్పళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్బంగా కడ్తాల మండల కేద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో కలిసి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి శాలువులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, రావిచెడ్ గోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వార్డ్ మెంబర్స్ గణేష్ గౌడ్, అశోక్, రామచంద్రయ్య, కడ్తాల సీనియర్ నాయకులు చందోజి, భాస్కర్ రెడ్డి, జహంగీర్ అలీ, యాట నర్సింహా, క్యామ రాజేష్, మల్లేష్ తదితరులు పాల్గోన్నారు.
కడ్తాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు





