కడ్తాల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 3 : నూతన కడ్తాల మండల అభివృద్ధికి తన శక్తి వంచన మేరకు కృషి చేస్తానన  అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నానని జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో కడ్తాల్ మండల అభివృద్ధి పనులుకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,  సిసి రోడ్ల గురించి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి  చేతుల మీదుగా రూ. 25 లక్షల ప్రొసీడింగును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి గ్రామానికి సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. మండల అభివృద్ధి గురించి నిరంతరం కృషి చేస్తానని అదేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *