కడ్తాల నూతన సిఐగా శివప్రసాద్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : కడ్తాల్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా సిఐ పోస్ట్ మంజూరు చేసినట్లు హోం మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. శనివారం నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం మంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కడ్తాల పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చిన సీఐ శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా త్వరలోనే ఆమనగల్లులో ఏసిపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *