కడ్తాల నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రత్యేకతలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 :  కడ్తాల మండల కేంద్రంలోని బటర్ఫ్లై సిటీ నిర్వాహకుల సహకారంతో సుమారు అర ఎకరం స్థలంలో, రూ.2 కోట్ల వ్యయంతో కడ్తాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మాణం చేపట్టారు. మొత్తం 9000  వేల చదరపు అడుగుల్లో జి ప్లస్-1 అంతస్తుల్లో పోలీస్ స్టేషన్ ను నిర్మించారుగ్రౌండ్ ఫ్లోర్ లో.. ఇన్ స్పెక్టర్ ఛాంబర్ (ఎస్ హెచ్ ఓ), రిసెప్షన్, సి‌సి కమాండ్ కంట్రోల్ రూమ్, వర్క్ స్టేషన్, సి‌ఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, విమెన్ హెల్ప్ డెస్క్, లాకాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో.. క్రైమ్ వర్క్ స్టేషన్, డిఐ, మల్టీ పర్పస్ హాల్, బ్యారెక్ లు, డైనింగ్ హాల్, యోగా అండ్ జిమ్ హాల్ ను ఏర్పాటు చేశారు. ఆయా చాంబర్లను హోంమంత్రి మహమ్మద్ అలీ డిజిపి అంజనీ కుమార్ సైబరాబాద్ పి స్టీఫెన్ రవీంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ,  నాగర్ కర్నూల్ ఎంపీ శ్రీరాములు,  కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బటర్ఫ్లై సిటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ బి. శేషగిరి రావు, ఈడిై రమేశ్, కడ్తాల్ మండల జెడ్పిటిసి దశరథ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, కడ్తాల్ సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, సింగల్ విండో చైర్మన్ వెంకటేష్,  ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు జోగు వీరయ్య, శంషాబాద్ ఏడీసీపీ రామ్ కుమార్, షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి, కడ్తాల్ ఎస్‌హెచ్‌ఓ హరి శంకర్ గౌడ్, కడ్తాల్ నూతన ఎస్‌హెచ్‌ఓ శివప్రసాద్,  ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు, ఎస్సైలు బలరాం నాయక్, శ్రీను ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *