కడ్తాల ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  కడ్తాల్ మండలంలోని పల్లెచెల్క తండా లో నెల కొన్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కడ్తాల్ ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పల్లె చెల్క తాండ గిరిజనుల తో కలిసి  హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఎంపీపీ కమ్లి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ని కలిసిన వారిలో పల్లెచెల్కతండా  సర్పంచ్ లోక్య, ఎంపీటీసీ అద్దాల రాములు, పల్లెచెల్కతండా గిరిజనులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *