కంబోడియా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

ఘటనలో 10 మంది మృతి.. 30 మందికి గాయాలు
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌కంబోడియాలోని గ్రాండ్‌ ‌డైమండ్‌ ‌సిటీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాంటే ంచే ప్రావిన్స్ ‌పరిధిలోని పోయ్పెట్‌ ‌పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ఈ హోటల్‌ ‌థాయ్‌ ‌లాండ్‌ ‌సరిహద్దులో ఉంది. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారంతా కంబోడియా, థాయ్‌ ‌లాండ్‌ ‌దేశాలకు చెందినవారే ఉన్నారు. గాయపడిన వారిని హుటాహుటిన సపంలోని ఆస్పత్రులకు తరలించారు.

స్థానిక పోలీసులు, డియా కథనం ప్రకారం.. హోటల్‌ ‌లోని మొదటి అంతస్తులో తొలుత మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్న సిబ్బంది, కస్టమర్లు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.  ఈక్రమంలో కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు దూకే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌ ‌లో దాదాపు 400 మంది ఉన్నారు.  అయితే ఈ హోటల్‌ ‌లో మంటలను ఆర్పేందుకు థాయ్‌ ‌లాండ్‌ ‌దేశానికి చెందిన సరిహద్దు నగరం నుంచి కూడా అగ్నిమాపక వాహనాలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *