కందుకూరు మృతుల కుటుంబాలకు బాబు పరామర్శ

  • ఒక్కో కుటుంబానికి పార్టీ పక్షాన రూ.24లక్షలు పంపిణీ
  • వారి బాధ్యతను టిడిపి చూసుకుంటుందని హా
  • ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌29: ‌నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల పిల్లలను చదివించే బాధ్యత టీడీపీది అని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ, టీడీపీ నేతల తరపున రూ.24లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇరుకు రోడ్లలో సభలు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు సభలు పెట్టే చోటే తాము పెట్టామన్నారు.

తమపై విమర్శలు చేసినవారి విజ్ఞతకే అన్నీ వదిలిపెడుతున్నా అని చంద్రబాబు పేర్కొన్నారు. కందుకూరు ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు  ఆర్థిక సాయం ప్రకటించారు. టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి ఒక్కొక్క కుటుంబానికి రూ.24 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15లక్షలు, ఇంటూరి నాగేశ్వర్‌ ‌రావు రూ. 1 లక్ష, ఇంటూరి రాజేష్‌ ‌రూ.1 లక్ష, శిష్‌ట్లా లోహిత్‌ ‌రూ. 1 లక్ష, బేబీ నాయన రూ.50 వేలు, కేశినేని చిన్ని రూ.50 వేలు, కంచర్ల సుధాకర్‌ ‌రూ.2 లక్షలు, కంచర్ల శ్రీకాంత్‌ ‌రూ. 1 లక్ష, అబ్దుల్‌ అజీజ్‌ ‌రూ.50వేలు, పోతుల రామారావు రూ.50వేలు, పొడపాటి సుధాకర్‌ ‌రూ.50 వేలు, వెనిగండ్ల రాము రూ. 50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *