పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ లో నూతన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు మొదటిసారి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు తమ బాధ్యతగా, హక్కుగా భావించి రాష్ట్ర అభివృద్ధి కోసం తాము సైతం నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనే ఉద్దేశంతో తప్పకుండా ఓటు వేయాలని వచ్చి ఓటు వేసినట్టు నర్ర.విశాల్(బద్రి) నర్ర.ఉష శ్రీ, లలోపాటు యువతి, యువకులు తెలిపారు. అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, మొదటిసారి ఓటు వేసినందుకు చెప్పలేనంత ఆనందం కలిగిందని తెలిపారు.
ఓటుకు నూతన ఓటర్ల ఉత్సాహం





