సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ క్లబ్బుకు చెందిన సభ్యులు ఓటర్ చైతన్య యాత్రలో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఎన్. శ్వేత ను కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత ఓటర్ చైతన్య యాత్ర సైక్లింగ్ ద్వారా చేస్తున్నందుకు సభ్యులందరినీ అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైందని దీనిని అర్హత ఉన్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ క్లబ్బుకు చెందిన 9 మంది సభ్యులు గ్రామాలలో పట్టణాలలో సైక్లింగ్ ఓటు హక్కు విలువను గురించి తెలియపరుస్తూ యువతి యువకులను ప్రజలను చైతన్య 800 కి. మి. దూరం ప్రయాణం చేయడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సేవల సమాచారం గురించి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందని ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలోహైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ క్లబ్బు సభ్యులు రవి,రాజేష్, విజయ్ ప్రసాద్, లావణ్య, రత్న, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





