ఒక్క అవకాశం ఇస్తే కల్వకుర్తిని అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. తలకొండపల్లి మండలంలోని   చంద్రదాన, అంతారం , వెంకటాపూర్, జూలపల్లి గ్రామాలలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామాలకు వచ్చిన ఆచారి కి మహిళలు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అంతారం గ్రామంలో నూతన బీజేపీ పార్టీ కార్యాలయన్ని ఆచారి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గడపగడపకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనీ.. ఇంటింటా ప్రచారం చేస్తూ కమలం గుర్తుకి ఓటు వేసి ఓక్కసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమంలో  బిజెపి నాయకులు మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *