కాప్రా ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తా.
నీటి సమస్య, చెత్త డంపింగ్ సమస్యలు పరిష్కరిస్తా
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 27: ఒక్క అవకాశం ఇవ్వండి..సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానని ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూగతంలో గెలిపించారు. అభివృద్ధి చేసి చూపించానని అప్పుడు అర్థాంతరంగా పదవి ముగిసిపోయింది. దాంతో చేపట్టిన పనులన్నీ ఆగిపోయాయి. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే వాటిని నిర్లక్ష్యం చేశాడు. అభివృద్ధి గాలికి వదిలేశాడు. ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేశాడు. ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేశాడు. అలాంటి పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. నన్ను మళ్లీ ఒకసారి గెలిపించండి. ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మొదలుపెడతా…ప్రగతిని పరుగులు పెట్డిస్తా..ఉప్పల్ నియోజకవర్గం నెంబర్ వన్ చేస్తా.. అన్నారు. శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో ఉప్పల్ డివిజన్ లోని కావేరి నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, పద్మావతి కాలనీ ,లో పాదయాత్ర నిర్వహించారు. ఉప్పల్ కావేరి నగర్ కల్వర్టు అస్తవ్యస్తంగా ఉన్న టైంలో నిధులు తీసుకొచ్చి కల్వర్టును కట్టించిన ఘనత నాకే దక్కుతుందని అన్నారు. కావేరి, నగర్, పద్మావతి కాలనీ ,సెవెన్ హిల్స్ కాల,నీలో డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగానే వుంది. మళ్ళీ నేను గెలిచిన వెంటనే సమస్య పరిష్కరిస్తా అన్నారు. ఉప్పల్ ను అందమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరితమైన మాటలకు, డబ్బులకు లొంగకుండా ఓటు వేయాలని కోరారు. అనంతరం కాప్రా డివిజన్ భవాని నగర్ లోని వరుణ్ ఎంక్లేవ్ నివాసులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రభాకర్ పాల్గొన్నారు. , ఈ సందర్భంగా కొన్ని సమస్యలు ప్రభాకర్ దృష్టికి తెచ్చారు. ట్రాఫిక్ సమస్యలు, మరియు వాటర్ సమస్య డంపింగ్ యార్డ్ సమస్య గురించి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లోని మై ఫీల్డ్ హోమ్స్ లో అపార్ట్మెంట్ వాసులతో కలిసి ప్రభాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు యొక్క ప్రధాన సమస్యలు వర్షం వచ్చినప్పుడు సెల్లార్ లోకి నీళ్లు రావడం, మంచినీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య, ట్రాఫిక్ సమస్య, డంపింగ్ యార్డ్ సమస్యలను ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారు. తప్పకుండా పరిష్కారం చూపిస్తానని ప్రభాకర్ మాటిచ్చారు. బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఎన్నికలు వచ్చినప్పుడే వారు ప్రజల దగ్గరికి వస్తున్నారని అటువంటి నాయకులు దగ్గర రాకుండా తరిమివేయాలని ప్రభాకర్ కోరారు. ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ ఈసీఐఎల్ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్, బి ఎం ఎస్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ వారితో ప్రభాకర్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు వారి సమస్యలు ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రభాకర్ మాటిచ్చారు.




