ఒక్క అవకాశం ఇవ్వండి  మీ సమస్యలను తీరుస్తా

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: మన ఓట్లను మనమే వేసుకొని పాలకులమవుదామా లేదంటే మన ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తూ మన ఓట్లతో లబ్ది పొందుతున్న పాలకుల కు బానిసలుగా ఉందమా తేల్చుకునే సమయం ఆసన్నమైందని పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం  బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.బొల్లారం మున్సిపాలిటీ లోని ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రజలకు బహుజన రాజ్యాధికారంతో పాటు బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో ను వివరించారు.నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ… సబండవర్గాల ఏజెండా గా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.మన బిడ్డలు చట్ట సభల్లో ఉంటేనే మన వర్గాలకు  సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మన జాతులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయలకే పరిమితం చేస్తూ బానిసలుగా చూస్తున్న బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. పేరుకు బొల్లారం మున్సిపాలిటీ గా పదోన్నతి చెందిన అభివృద్ధిలో మాత్రం అధోగతి గా ఉందని విమర్శించారు. కాలనీలో ఎక్కడ చూసినా గతుకుల రోడ్లు మురికి కాలువలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. మన ఓట్లు మనమే వేసుకొని మనల్ని మనం గెలిపించుకుంటే మన వాడల్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. నన్ను గెలిపించిన క్షణం నుంచే పక్క ప్రణాళికతో బొల్లారం మున్సిపాలిటీ ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా ఇండ్లు లేని నిరుపేదలకు పక్క ఇండ్లు కట్టించే దిశగా అడుగులు వేస్తానన్నారు. బొల్లారం పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక పాలసీని రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. కార్మికుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి ప్రతి కార్మికునికి పని కి తగిన వేతనం అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నవంబర్ 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో మీరంతా మీ కుటుంబ సభ్యుడైన మీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ కు అండగా నిలబడి బీఎస్పీ పార్టీ కి మద్దతు ఇస్తూ ఏనుగు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువకులు, కార్మికులు, కాలనీ వాసులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *