ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : ఒకసారి అవకాశం ఇవ్వండి కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమనగల్లు మండలంలోని గేటు తండా, పెద్దతండ, చిన్న తండా, గౌరారం, కోనాపూర్, శెట్టిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. అంతకు ముందు ఆమనగల్లు సురసముద్రం కట్టపై ఉన్న మైసమ్మ దేవత ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ఆచారి గీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూశానని ఆరోసారి మీ ముందుకు ఆశీర్వదించమని వస్తున్నానని ఈసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నా ప్రాణం ఉన్నంతవరకు మీ సేవ చేస్తానని ఆచారి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండే హరి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కేకే శ్రీను, నందు, మున్సిపాలిటీ పాలకవర్గం తదితరుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *