అందమైన ప్రకృతిలో
విహరిస్తున్న..
నా మనసెందుకో
మందంగా ఉంది,
ఏదోలా అనిపిస్తుంది.
చుట్టూ ఏదో ఆవహించి
చురుకుదనం ఆవిరైంది..
ఇది గ్రహచారమా లేక
నా అపచారమా?
గాలి వీస్తుంది
చిరు వెన్నెల కురుస్తుంది,
చుక్కలుమెరిసే ఆకాశంలో
చందమామ విహరిస్తోంది.
అదే దేశం-ఇదే ప్రదేశం,
అయినా..
ఏదో దిగులుగా ఉంది,
ఆహ్లాదం..
దారికి రానంటుంది,
ఇది ఏదైనా శాపమా..
నను అనుసరిస్తున్న
పాపమా??
– ఎన్.రాజేష్, (కవి, జర్నలిస్ట్)
హైదరాబాద్.




