ఏకేఐఎఫ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కాసాని వీరేష్ కు అభినందనలు తెలిపిన కాసాని యువసేన నేతలు

పరిగి,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ఆమెచుర్ కబడ్డీ పేడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఐఎఫ్)వైస్ ప్రెసిడెంట్ గా  కాసాని వీరేష్ ముదిరాజ్ ఎన్నికైన నేపథ్యంలో కాసాని యువసేన నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శాలువా కప్పి సన్మానించి  శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం  కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ….క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని,క్రీడల ద్వారా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.క్రీడల పట్ల ఆసక్తి ఉన్న  క్రీడాకారులకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని యువసేన సభ్యులు పర్శమోని బాబు, దోమ శ్రీశైలం, చౌడాపూర్ మాసయ్య ముదిరాజ్, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *