ఎస్.ఎన్.డి.పీ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర జూలై 26 : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్ రోనాల్డ్ రోస్ చే కలిసి గడ్డిఅన్నారం డివిజన్, లింగోజిగూడా డివిజన్ల లో పర్యటించారు. ఈ సందర్భంగా వీ.వీ.నగర్ దగ్గర జరుగుతున్న పైపు లైన్ పనులను కమిషనర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. 2016 నందు ఇట్టి డ్రైన్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది అని తెలిపారు. ఇట్టి డ్రైన్స్ దగ్గర చెత్త, చెదారం తట్టడం జరిగింది. దానివల్ల మురుగునీరు కాలనీ నందు పొంగిపొర్లడం జరిగింది అని తెలిపారు. అట్టి డ్రైన్స్ నందు పెద్ద, పెద్ద మొద్దులు, చెద్దర్లు వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే సరూర్ నగర్ చెరువు వద్ద చెత్తను నివారించేందుకు పెద్ద, పెద్ద గ్రిల్స్ నిర్మించాలని కోరారు. అలాగే చెరువు నందు మొద్దులు, చెదర్లు, ఇతర వస్తువులు వేయకుండా జీ.హెచ్.ఏం.సీ.సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం లింగోజిగూడా డివిజన్ పరిధిలోని అల్తాఫ్ నగర్ వద్ద జరుగుతున్న డ్రైన్స్ పనులను పరిశీలించారు. ప్రక్కనే ఉన్న బైరామాల్ గూడ చెరువును కూడా సందర్శించడం జరిగింది. సరూర్ నగర్ చెరువు నందు మూడో గేటు ఎర్పాటు చేయడం జరిగిందని, అట్టి గేటు ఎర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం కోదండరాం నగర్, వీ.వీ.నగర్ కాలనీలు ముంపు సమస్యల నుంచి విముక్తి లభించింది అని తెలిపారు. ఇప్పటికే 80% పనులు పూర్తి కావడం జరిగింది అని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ప్రణాళిక బద్దంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ కొన్ని మాట్లాడుతూ వి.వి.నగర్ దగ్గర జరుగుతున్న డ్రైన్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సరూర్ నగర్ చెరువు నందు మొద్దులు, చెద్దర్లు, ఇతర వస్తువులు వేయకుండా చూసుకోవాలి అని ఆదేశించారు. అలాగే అల్తాఫ్ నగర్ నందు జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. బైరామల్ గూడ చెరువును కూడా రాబోయే రోజుల్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, కమిషనర్లు అరుణ, రవీందర్, మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్, ముద్రబోయిన శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, వరప్రసాద్ రెడ్డి, ఆనంద్ గౌడ్, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *