ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హయత్ నగర్ డివిజన్ కుంట్లూర్ రోడ్డులో దత్తాత్రేయ కాలనీలో డ్రైనేజీ, వాటర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …అన్ని కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నుంచి కాపాడేందుకు చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు అంజలి గౌడ్, మాజీ అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, కాలనీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్,కోశాధికారి శోభన్, ఉపాదక్షులు శ్రీధర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, రామస్వామి సీనియర్ నాయకులు, ఉద్యమకారులు,మహిళలు,కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *