ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : డేటా ట్రాన్స్‌మిషన్, విశ్లేషణ సేవ ఎల్గి ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్ ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్ కంప్రెసర్ తయారీదారులలో ఒకటి, భారత మార్కెట్ కోసం ఎల్ఓటీ ఆధారిత ఎయిర్ కంప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ అయిన ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టినట్లు గురువారం ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్గి అనేది కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్స్ కోసం ఒక స్మార్ట్ మానిటరింగ్, అలర్ట్ సిస్టం ఈ సంవత్సరం ప్రారంభంలో జర్మనీలోని హన్నోవర్ మెస్సేలో విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, ఎల్గి ఎయిర్ అలెర్ట్ స్మార్ట్ 24/7 రిమోట్ మానిటరింగ్, అలర్ట్ సిస్టమ్ ఇప్పుడు భారత దేశంలో ఉన్న ఎల్గి కస్టమర్‌లకు ఇన్‌స్టాలేషన్‌ల కోసం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.



