పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాగృతి పేరుతో ప్రజలను ఏకం చేసిన ఘనత ఎమ్మెల్సీ కవిత కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.హైదరాబాద్ లోనీ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెను నీలం మధు ముదిరాజ్ పుష్పగుచ్చం,శృంగేరి శారదా దేవి ప్రతిమ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలను మన రాష్ట్రం, దేశంలోనే కాక విదేశాల్లో కూడా పెద్దపేట వేసేలా చేశారన్నారు. బతుకమ్మ ఉత్సవాలు దేశ విదేశాల్లో సైతం ఆడుతున్నారంటే ఎమ్మెల్సీ కవిత చేసిన కృషి అన్నారు.మనందరం మన ఆచార సాంప్రదాయాలను గౌరవించుకునే విధంగా ఆమె వెంట నడవాల్సిన అవసరం ఉందన్నారు.



