ఎమ్మెల్యే కాలే యాదయ్య ను ఇంటికి పంపాలి 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 03: బీఎస్పీ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజా మహేద్ర వర్మ అన్నారు.చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం బీఎస్పీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి రాజా మహేంద్ర వర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలను నట్టేట ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని,పదేళ్లుగా ప్రజలను పిచ్చోళ్లను చేసిండ్రని,ఈ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కమిషన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే పరిపాలన కొనసాగింస్తున్నదన్నారు.ఈ ఎన్నికల్లో యాదయ్య ను బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు.యాదయ్య ఇంటికె పరిమితం చేయాలి ప్రజలను కోరుకుంటుంన్నానారు.బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఏం అభివృద్ధి చెందిందని ఇప్పటికి  హైదరాబాదులో ఐదు రూపాయల బువ్వ కోసం పడిగాపులు కాస్తున్నారని,కాలేశ్వరం పిల్లర్ల లెక్క బీఆర్ఎస్ పరిపాలన విక్ గా ఉందన్నారు.డబ్బులు ఇస్తే జనాలు ఓట్లు వేస్తారు అనుకోవడం మూర్ఖత్వం అని త్వరలో ఈ పరిపాలనకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో…. అసెంబ్లీ ఇంచార్జ్ అబ్రహం లింకన్,అసెంబ్లీ అధ్యక్షులు చందు,ఉపాధ్యక్షులు శ్రీశైలం,చేవెళ్ల మండల అధ్యక్షులు మొకరం కుమార్,మొకరం రాజు,వివిధ మండలాలకు చెందిన అధ్యక్షులు,బీఎస్పీ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *