- క్రైమ్ రేటు మాత్రం తగ్గింది
- వివరాలు వెల్లడించిన రాష్ట్ర డిజిపి రాజేంధ్రనాథ్ రెడ్డి
అమరావతి, డిసెంబర్ 28 : ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాదికాలంగా సైబర్ నేరాలు పెరిగాయని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో క్రై రేటు తగ్గిందని డీజీపీ వివరించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో 2022లో జరిగిన నేరాలు, దోపిడీ, దొంగతనాలు, హత్యలు తదితర వాటిని వివరించారు. ఈ ఏడాది 2700 సైబర్ క్రై కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. పోలీసు అధికారులకు సైబర్ నేరాలను అదుపులో ఉంచడానికి నాలుగు చోట్ల రీజినల్ సైబర్ సెంటర్స్ పెట్టి శిక్షణ ఇస్తామని తెలిపారు. సైబర్ నేరాలు కాకుండా ఈ ఏడాది ఏపీలో క్రై రేటు తగ్గిందని అన్నారు. గతేడాది కంటే 60 వేల కేసులు తక్కువ నమోదు అయ్యాయని తెలిపారు.
ఏపీలో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గిందని వెల్లడించారు. లోక్ అదాలత్లో 57 వేల కేసులను పరిష్కరించామని డీజీపీ తెలిపారు. శిక్షలు పడే శాతం పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేస్తున్నామని అన్నారు. అత్యాచారాలు, హత్యకేసుల్లో 44 మందికి శిక్ష పడిందన్నారు. 88.5శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందని వెల్లడించారు. లోక్ అదాలత్లో 57 వేల కేసులను పరిష్కరించామన్న రాజేంద్రనాథ్ రెడ్డి.. శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2గా ఉందని.. మహిళలపై అత్యాచారాల, హత్య కేసుల్లో 44 మందికి శిక్ష పడిందని వివరించారు. 88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
2021 కంటే 22లో 60 వేల కేసులు తక్కువ నమోదు అయ్యాయని చెప్పారు. 169 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని.. 2021లో 2 లక్షల 84 వేల 753 కేసులు నమోదు కాగా.. 2022లో 2 లక్షల 31వేల 359 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. మహిళా పోలీసుల వల్ల గ్రామాల్లో నేరాలకు పాల్పడే వారి వివరాలు ముందే తెలుసుకోగలిగామని స్పష్టం చేశారు. హత్యలు 945 నుంచి 857కి తగ్గాయని.. కానీ దొంగతనాలు కొంత పెరిగినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.



