ఎపి బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

గులాబీ కండువా కప్పుకున్న మాజీ మేయర్‌ ‌తాడి శకుంతల
అమరావతి, ఫిబ్రవరి 24 : బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌శాఖలో ప్రముఖుల చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. విజయవాడ మాజీ మేయర్‌ ‌తాడి శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్‌ ‌రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి , ఓబీసీ ఫెడరేషన్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి , పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ‌వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. మాజీ మేయర్‌ ‌తాడి శకుంతల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *