ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: క్రీడలతోనే యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు రవి చారి తెలిపారు. రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి లో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవి చారి, నిర్వాహకులు మాట్లాడుతూ… నాగులపల్లిలో కబడ్డీ పోటీలు నిర్వహించడంతో యువతను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి గ్రామంలో ఎన్ఏంఆర్ యువసేన ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించామని అన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు బహుమతులను ప్రధానం చేశామని తెలిపారు. ప్రతి వ్యక్తికి నిత్యం వ్యాయామం అవసరమని అది క్రీడల ద్వారానే సాధ్యపడుతుందని తెలిపారు. గెలుపోటములను పక్కనపెట్టి ప్రతి క్రీడాకారుడు అందరితో స్నేహ భావాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు. శారీర దారుడ్యం, మానసికోల్లాసం క్రీడలతోనే కలుగుతాయని, ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో రాణించి తన ప్రతిభను చాటుకోవాలని తెలిపారు. క్రీడలకు తమ ఎన్ఎంఆర్ యువసేన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రానిచ్చే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లి ఊరికి కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. ఈ పోటీల నిర్వాహకులు బాలకృష్ణ, లక్ష్మణ్, సురేష్, లింగం, నిర్వహించడం జరిగిందని దీనికి ముఖ్య అతిథులుగా రవి చారి, నారాయణ చారి, అమర్ ముదిరాజ్, పట్నం లక్ష్మణ్ లు హాజరయ్యారు. వెలిమెల, కొల్లూరు, నాగులపల్లి, ఎన్ఎంఆర్ యువసేన ఏ టీమ్, ఎన్ఎంఆర్ యువసేన బి టీమ్, నాగులపల్లి జడ్పిహెచ్ఎస్ టీమ్, న్యూ ఎంఐజి, ఓల్డ్ ఎంఐజి, తెల్లాపూర్ విశాల్ టీంలు మొత్తం 10 జట్టులు పాల్గొన్నాయన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలుగా నిలిచిన నాగులపల్లి జట్టుకు కప్, పదిహేను వేల రూపాయల నగదు, రెండో స్థానంలో నిలిచిన పాత ఎంఐజి జట్టుకు ట్రోఫీ, మూడో స్థానంలో నిలిచిన న్యూ ఎంఐజి జట్టుకు ట్రోఫీ, ఐదు వేల రూపాయలు నగదు పురస్కారానికి అందజేశారు, బెస్ట్ రైడర్ గా నిలిచిన రాముకు ఐదు వందల రూపాయలు, బెస్ట్ డిఫెండర్ గా నిలిచిన దిలీప్ కు ఐదువందల రూపాయలు పారితోషకాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *