ఎదురెదురుగా వేగంగా వస్తున్న రైళ్లు ఢీ

తెంపీ,మార్చి1: ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొని 26 మంది సజీవదహనమైన ఘోర ఘటన మంగళవారం రాత్రి గ్రీస్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 85 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌‌డియాలో వైరల్‌గా మారాయి. తాము ఉలిక్కిపడ్డామని, భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఏథెన్స్ ‌నుంచి థెసాలోనికి వెళుతున్న ఓ ప్రయాణికుల రైలు.. తెంపీ సపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి.

మరిన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు బోగీల్లో 26 మంది సజీవదహనమవ్వగా మరికొంతమందిని సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్‌ ‌రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. చీకటిగా ఉండటం, మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *