ఎక్కడైనా కెసిఆర్‌తో చర్చకు సిద్ధం…

  • గూగుల్‌ను అడిగితే ఎవరి అర్థిక స్థితి ఏమిటో చెబుతుంది
  • పొలిటికల్‌ ఎజెండాతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ
  • తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులకు ఎలా చేరిందో చెప్పలేదు
  • ఇచ్చిన పలు హావి•లపై అసెంబ్లీలో చర్చించలేదు
  • మోదీని విమర్శించడమే లక్ష్యంగా కెసిఆర్‌ ‌ప్రసంగం
  • అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ‌ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కౌంటర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం..మరి వి•రు చర్చకు వొస్తారా…అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు సవాల్‌ ‌చేశారు. చర్చ కోసం ప్రెస్‌క్లబ్‌కు వొస్తారా, అమరవీరుల స్థూపం దగ్గరకు వొస్తారా అంటూ సవాల్‌ ‌విసిరారు. ప్రగతిభవన్‌కు, ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా.. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వొస్తారా, రండి అంటూ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఛాలెంజ్‌ ‌విసిరారు .తెలంగాణ బడ్జెట్‌ ‌సమావేశాలను సీఎం కేసీఆర్‌ ‌తన పొలిటికల్‌ ‌సమావేశాలుగా మార్చుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. కేంద్రాన్ని తిట్టేందుకే కేసీఆర్‌ అసెంబ్లీని వాడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థుల సమస్యలు, గ్రామాల్లోని కేసీఆర్‌ ‌బెల్టు షాపులు, ధరణి సమస్యలపై  చర్చిస్తే బాగుండేదన్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్‌ను పొగిడేందుకు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి బడ్జెట్‌ ‌సమావేశాలా..లేక మోదీపై విద్వేశం వ్యక్తం చేసే సమావేశాలా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ ‌చెప్పిన తిరుమలరాయ కథ ఆయనకే వర్తిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేసీఆర్‌ ‌రాజీనామాపై ఇప్పుడే ఎందుకు..ఎన్నికల తర్వాత ఎలాగూ రాజీనామా చేయాల్సిందే అని ఎద్దేవ చేశారు. సోమవారం వి•డియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై బురద చల్లేందుకే అసెంబ్లీని ఉపయోగించుకున్నారంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా అసత్య ఆరోపణలు చేశారని.. వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరాశ, నిస్పృహలతో కెసిఆర్‌ ‌ప్రసంగం ఉందన్నారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హావి•ల్ని ఏం చేశారో చెప్పాల న్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్క మాట చెప్పలేదన్నారు. మండలిలో కాంగ్రెస్‌ ‌లేకుండా చేసింది వాళ్లే అని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌మద్దతు కోసం అర్రులు చాస్తున్నారని.. అందుకే సీఎం కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ను పొగడ్తలతో ముంచెత్తారన్నారు. బీజేపీకి ఒక సీటు కూడా రాదన్నారు. బీఆర్‌ఎస్‌కు వరదలా వొట్లు వొస్తాయట..దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా కేసీఆర్‌ ‌మాట్లాడారు.

తన పరిధి దాటి కేసీఆర్‌ ‌మాట్లాడారు.. అన్ని దేశాల ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు.. కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మాత్రం మాట్లాడలేదని మండిపడ్డారు. గూగుల్‌ను అడిగితే ఏ దేశ అర్థిక పరిస్థితి ఏమిటన్నది తెలిసేదన్నారు. తెలంగాణ 60 లక్షల మిగులు బడ్జెట్‌ ‌నుంచి 5లక్షల కోట్ల అప్పులకు చేరిన విషయంపైనా చర్చించి ఉంటే బాగుండేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు పార్లమెంట్‌కు రారు..పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలపై అసెంబ్లీలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము ధైర్యం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎందుకు మాట్లాడలేదన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్లు, బడ్జట్‌ ‌సమావేశాలను పొలిటికల్‌ ‌వి•టింగ్స్‌గా మార్చుకున్నారు. సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఒక్క మాట మాట్లాడలేదన్ని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితులపై కేసీఆర్‌కు అవగాహన లేదన్నారు. కేసీఆర్‌ ‌దేశ ఆర్థిక పరిస్థితులతో పాటు..విదేశాల ఆర్థిక పరిస్థితులపై గుగూల్‌లో సెర్చ్ ‌చేయాలని సూచించారు. బంగ్లాదేశ్‌, ‌సింగపూర్‌, శ్రీ‌లంక దేశాలతో పోల్చుతూ…దేశ ఆర్థిక పరిస్థితిపై తక్కువ చేసే ప్రయత్నం కేసీఆర్‌ ‌చేశారని మండిపడ్డారు.

దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించాలనే కేసీఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కిషన్‌ ‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్థూపం, ప్రగతి భవన్‌, ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌లేదా ఎక్కడైనా దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమన్నారు. మాట్లాడితే రాజీనామాకు సిద్ధమంటూ కేసీఆర్‌ ‌ప్రకటిస్తున్నారని..రాజీనామాకు అంత తొందరెందుకు అని కిషన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఎలాగూ రాజీనామాను రాజ్‌భవన్‌లో ఇవ్వక తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల దోపిడి జరుగుతుందని ఆరోపించారు. రాష్టం ఏర్పడినప్పుడు 60 వేలకోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. కవి•షన్ల కోసమే అప్పులు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ ‌చెప్పిన తిరుమల రాయుని పిట్టకథ కేసీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని చురకలంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *