ఎం‌బిబిఎస్‌ ‌నెక్టస్ ‌పరీక్షలు వాయిదా

న్యూ దిల్లీ, జూలై 18 : 2019 బ్యాచ్‌ ఎం‌బీబీఎస్‌ ‌ఫైనలియర్‌ ‌విద్యార్థులకు తదుపరి పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌.. ‌తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం.. ఈ నెల 28న ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్‌ఎం‌సీ ఎథిక్స్ అం‌డ్‌ ‌మెడికల్‌ ‌రిజిస్టేష్రన్‌ ‌బోర్డు సభ్యుడు డాక్టర్‌ ‌యోగేంద్ర మాలిక్‌ ‌ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు. ఫీజును రీఫండ్‌ ‌చేయనున్నట్టు తెలిపారు. అయితే పరీక్ష రద్దుపై ఎన్‌ఎం‌సీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

కేంద్ర వైద్య శాఖ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నెక్టస్ ‌పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్‌ఎం‌సీ ఈ నెల 13న ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేశారు. దీనిపై ఎన్‌ఎం‌సీ నుంచి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. నెక్టస్ ‌మార్గదర్శకాలను ఎన్‌ఎం‌సీ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు రెండు దశల్లో (నెక్టస్ ‌స్టెప్‌1, ‌నెక్టస్ ‌స్టెప్‌ 2) ‌నిర్వహిస్తారు. పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు, దేశంలో వైద్యుడిగా ప్రాక్టీస్‌ ‌చేసుకునేందుకు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అలాగే విదేశీ మెడికల్‌ ‌గ్రాడ్యుయేట్లు భారత్‌లో ప్రాక్టీస్‌ ‌చేసుకోవాలన్నా ఈ పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *