ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్లే బాలిక మృతి పోస్ట్‌మార్టమ్‌ ‌ప్రాథమిక నివేదికలో వెల్లడి

మేడ్చెల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దమ్మాయిగూడలో బంధువులు, స్థానికుల ఆందోళన మధ్య పోలీసులు బాలిక డెడ్‌ ‌బాడీని ఇంటికి తరలించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి పంపారు. అయితే అంబులెన్సును చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం జరిగిందో చెప్పడంతో పాటు బాలిక కుటుంబానికి న్యాయం చేసేంత వరకు అంబులెన్స్‌ను కదలనిచ్చే ప్రసక్తేలేదని అన్నారు.

చిన్నారి కడసారి చూపుల కోసం వేలాది మంది తరలివచ్చారు. చిన్నారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.  స్థానిక నాయకులు సైతం బాలిక మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాలిక మృతదేహానికి పోస్ట్ ‌మార్టం ముగిసిన తరవాత బాడీని అప్పగించారు.  డాక్టర్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం బాలిక శరీరంపై ఎటువంటి  గాయాలు లేవని తేల్చారు. చిన్నారి ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు గుర్తించారు. చెరువులో పడి నీరు మింగడం వల్లే బాలిక చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే బాలికను ఎవరైనా చెరువులో తోసేశారా..?.. లేక తనే ఆడుకుంటూ చెరువులో పడిందా అనేది తేలాల్సి ఉంది. నిబంధనల మేరకు గాంధీ హాస్పిటల్‌ ‌డాక్టర్ల బృందం పంచనామా, పోస్ట్ ‌మార్టం పూర్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *