కోయిల కూయాలా
ఆమని రావాలా
వెన్నెల కాయాలా
కలువలు పూయాలా

వానలు కురియాలా
వసుధే నవ్వాలా
ఉషస్సు రావాలా
తమస్సు పోవాలా

కిరణుడు రావాలా
కమలమె విరియాలా
పున్నమి రావాలా
సంద్రం పొంగాలా

తరువులు పెరగాలా
కరువులు  తరగాలా
పరువుగ బతకాలా
పరుగులు ఆపాలా

– గుండాల నరేంద్ర బాబు
తిరుపతి
హస్త వాణి:9493235992

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *