ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కాప్రా డివిజన్, సాయి బాబా నగర్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి లు హాజరై డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ అందజేస్తామని తెలిపారు శల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి దఫా ఉప్పల్ నియోజకవర్గంలో 500 ఇండ్లను పంపిణీ చేసామని. ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను 10 లేదా 15 రోజుల కోసారి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.ఆ తర్వాత గృహలక్ష్మి పథకం కింద పేదవారికి ఇంటి నిర్మాణంలో సాయం అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తున్నట్లుగా చెప్పారు.
తొలి దశలో ఇండ్లు రాలేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులను సమావేశ వేదికల వద్దకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. డబుల్ బెడ్ రూమ్ మంజూరు పత్రాలను అందుకున్న లబ్ధిదారులకు గృహప్రవేశం చేశారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డి, గీత ప్రవీణ్ ముదిరాజ్, కక్కిరేణి చేతన హరీష్, బండారు శ్రీవాణి వెంకట్రావు, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, ఆర్డిఓ శ్యాం ప్రసాద్, ఎమ్మార్వో లు వెంకట్ నరసింహారెడ్డి, మతిన్,నోడల్ ఆఫీసర్లు ఉపేందర్ రెడ్డి, కాప్రా, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లు ముకుంద రెడ్డి, శ్రీనివాస్, హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు,బిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, బద్దం భాస్కర్ రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, పల్లె నర్సింగ్ రావు, గిల్బర్ట్ ,కుమారస్వామిబిఆర్ఎస్ నాయకులు , మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



