ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌హైదరాబాద్‌, అగస్ట్, 30 (ఆర్‌ఎన్‌ఎ) : ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్‌ ‌బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్‌ ‌యూనియన్‌ ‌నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది.

యూనియన్‌ ‌నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు తెలిపింది. తుది తీర్పుకు లోబడే బదిలీలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *