మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాలీలు కొత్త శిఖరాన్ని తాకాయని మంత్రి ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాలీలు 11 శాతం ఉండగా..‘భారత్ వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్ గర్నమెంట్‌లో ఖాలీలు 12.1శాతానికి చేరాయంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
కేంద్రంలో ఖాలీలు 25 శాతానికి చేరాయని విమర్శించారు. ఈ సందర్భంగా గణాంకాలతో ట్వీట్ చేశారు. హోమ్ మంత్రిత్వ శాఖలో 11.1శాతం, రైల్వేలో 20.5శాతం, డిఫెన్స్ సివిలియన్ 40.2శాతం, రెవెన్యూలో 41.6శాతంతో పాటు తదితర విభాగాల్లో ఖాలీలున్నాయని పేర్కొన్నారు.




