ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : నగర ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల స్పెషలిస్ట్ హెల్త్‌కేర్‌ను తీసుకురావడానికి ఒక ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్నామని ఉదయ్ ఓమ్ని హిస్పిటల్ ఉందని ఛైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాష్ అన్నారు. ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ 49 సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఆర్థోపెడిక్స్‌లో ఎక్సలెన్స్ సెంటర్‌గా ఉదయ్ ఓమ్నీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పేరుగాంచిందన్నారు. మొదట్లో ఉదయ్ క్లినిక్‌గా పిలవబడినప్పటికీ, 1974లో వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాష్ తన తండ్రి ఉదయ్ భానుజీ గౌరవార్థం హాస్పిటల్ కు పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. డాక్టర్ ప్రకాష్ ఈ వారం తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నట్లు తెలిపారు. సూర్య పుల్లగం ఆధ్వర్యంలోని ఓమ్ని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌తో అధికారికంగా విలీనం చేయబడిందన్నారు. 150 పడకలు, 24×7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, కష్టపడి పనిచేసే వైద్యుల బృందంతో నగరంలో ఆశాజ్యోతిగా నిలబడటం పట్ల గర్వంగా ఉందన్నారు. డాక్టర్ వేద్ ప్రకాష్, ఇందుమతి ప్రకాష్ లు ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ సమాజానికి స్పష్టమైన విలువను జోడించిందని అన్నారు.


