ఉల్లాసమే ఉచిత బస్సు
మహిళా లోకానికి అభయమస్తు!
అయినదానికి కాని దానికి బస్సు
ఇక ఎక్కి తిరుగవచ్చు మస్తు!
ప్రజా సేవయే మా కర్తవ్యం
ఈ నాడు నిజం అవుతున్న నినాదం !
దూర భారం కొంత తొలగింది
ఉచిత బస్సు కొండంత వెలిగింది !
కోపం వస్తే వెళ్లవచ్చు పెనిమిటి కి
చెప్పక నే పుట్టింటికి!
సంతకు, పని చెంతకు
మహిళలలు ఉచితంగా వెళ్ళి రావచ్చు!
సుట్టపక్కాల చేరి సంతోషంగా
బలగం బంధాలు పెంచుకోవచ్చు!
చదువులు చదివే పిల్లలకు తీరు
క్యూ లైన్ల బస్సు పాసుల కష్టాలు!
సినిమా షికారులకు
ఉచిత బస్సు శ్రీరామరక్ష!
తొక్కిసలు క్రిక్కిరిసిపోకుండ
మరో బస్సెక్కితే అదే మనకు రక్ష
టి.వి.సీరియల్లు చిన్న బోవు
వంటింట్లో
గాజులు లేని చేతుల గలగలలు!
నా ఇంటికి నేనే యజమానురాలిని
మహిళా సాధికారత కు ధన్యురాలిని!
బస్సు చక్రం తిరుగుడు ఆగిపోవద్దు
యిక మనం ఆగమాగం కావద్దు!
ప్రగతి రథం పడకేయవద్దు!
పక్కా పథకంతో జగతిలో
వన్నెకెక్కాలి ఉచిత బస్సు!
-పి.బక్కారెడ్డి
9705315250




