ఈనెల 6న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక అర్చన

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : అధికమాసం సందర్భంగా ఈనెల 6వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ లోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కమలం పూలతో అర్చన కార్యక్రమం హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం డబీర్ పుర, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం సహకారంతో శ్రీ అష్టలక్ష్మి సమేత మహాలక్ష్మి కమల పుష్పార్చన కార్యక్రమం 121 మంది దంపతులచే నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు సరబు లక్ష్మణ్ గుప్తా తెలిపారు. ఈ మేరకు గురువారం హైదర్గూడా ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా శ్రవణ స్వామి ఆధ్వర్యంలో భాస్కర యోగిచే ప్రవచనం  ఉంటుందని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బోగ్గరపు దయానంద్ గుప్తా, కొలేటి దామొదర్ గుప్తలతో పాటు పెద్ద ఎత్తున వివిధ బస్తి సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కటకం శివకుమార్ గుప్తా, కోశాధికారి లింగ ప్రకాష్ గుప్తా, దయాకర్ గుప్తా, వెంకటేశ్వర్లు సత్యం గుప్తా, శ్రీరామ్ గుప్తా, శ్రీనివాస్ రావు, వెంకట గోపాలకృష్ణ, స్వర్ణలత, శ్రీనివాస్, తాడిశెట్టి పశుపతి, తలకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *