ఈడి సమన్లు కాదు..అవి మోదీ సమన్లు

  • వరుసగా మంత్రులు, నేతలపైనా దాడులు
  • రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర
  • విపక్షాలపైనే 90 శాతం దాడులు
  • దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం
  • దానీకి బినావి•గా మోదీ అన్నది నిజం
  • డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే వారిద్దరే
  • ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోదీ
  • పోర్టుల్లో డ్రగ్స్ ‌దొరికినా చలనం లేదు
  • నిబంధనలకు విరుద్ధంగా ఆదానికీ ఆరు ఎయిర్‌పోర్టులు
  • వి•డియా సమావేశంలో ప్రధాని మోదీపై మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, అవి కచ్చితంగా మోదీ సమన్లని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. వరుసగా మంత్రుల వి•దా ఇడి, ఐటి దాడులు చేయించారని అన్నారు. మంత్రి గంగుల వి•ద ఈడీ, సీబీఐ దాడులు చేయించారు. మల్లారెడ్డి వి•ద ఐటీ దాడులు చేయించారు. తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌పీఏ ఇంటి వి•ద ఈడీ దాడి చేసింది. జగదీశ్‌ ‌రెడ్డి పీఏ ఇంటి వి•ద ఐటీ దాడులు చేసిందని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ వెల్లడించారు. వి•డియా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, శ్రీ‌నివాస గౌడ్‌, ఎం‌పి రంజిత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ‌పాల్గొన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌సమన్లు పంపడంపై తెలంగాణ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్‌ ‌తీవ్రంగా స్పందించారు. తమ మంత్రులపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశారని.. బీజేపీ దర్యాప్తు సంస్థలను ఇలా ఉసిగొల్పుతుందని తీవ్ర ఆరోపణ చేశారు.

గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రులతో కలిసి ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ఏదో జరుగుతుందని భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని కేటీఆర్‌ ‌చెప్పుకొచ్చారు. నీతిలేని పాలకుల అవినీతి ప్రభుత్వంగా కేంద్రం మారిందని, మోదీ చేతుల్లో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ అని తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ మోదీ బినావి• అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడని మంత్రి వ్యాఖ్యానించారు. అదానీ పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ ‌దొరికినా చర్యలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా 6 పోర్టులను అదానీకి ఇచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. ఎల్‌ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఉలకడు.. పలకడని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని, ఈడీ, సీబీఐ విపక్షాలపైనే 90 శాతం దాడులు చేశాయని కేటీఆర్‌ ‌విమర్శించారు. ప్రధాని మోదీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో గత 8 ఏండ్లుగా జరుగుతున్న ప్రహసనంలో భాగంగా ఇవాళ అయితే జుమ్లా లేకపోత హమ్లా అనే విధానంలో మోదీ ప్రభుత్వం ఉందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. నామా నాగేశ్వర్‌ ‌రావు వి•ద ఈడీ దాడులు చేయించింది. వద్దిరాజు రవిచంద్రపై సీబీఐ దాడులు చేసింది.

పార్థసారథి రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డిపై ఐటీ దాడులు చేయించారు. ఎమ్మెల్సీ రమణపై ఈడీ విచారణ జరిపారు. మంచిరెడ్డి కిషన్‌ ‌రెడ్డి, పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డిని ఈడీ విచారించింది. మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ ఐటీని ఉసిగొల్పింది. అక్కడ చేయగలిగింది ఏవి• లేక.. కేసీఆర్‌ ‌నాయకత్వంలో దేశంలో బీఆర్‌ఎస్‌ ‌పురోగమిస్తున్న విధానం, తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ సమన్లు పంపింది. ఇవి ఈడీ సమన్లు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లు. ఇది రాజకీయంగా చేసే చిల్లర ప్రయత్నం. సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలాగా మారాయాని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. నీతిలేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈ రోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అని కేటీఆర్‌ ‌విమర్శించారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి.. ఇవి తప్ప వీరు సాధించింది ఏవి• లేదు. కేంద్రాన్ని, ప్రధాని మోదీని ఒక్కటే అడుగుతున్నా.

గౌతమ్‌ అదానీ ఎవరి బినావి•..? ఆయన మోదీ బినావి• అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. అదానీపై హిండెన్‌ ‌బర్గ్ ‌సంస్థ రిపోర్టు ఇచ్చినా కేంద్రం మాట్లాడలేదు. ఎల్‌ఐసీ, ఎస్బీఐకి చెందిన రూ. 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా.. ఈ దేశ ప్రధాని ఉలకడు పలకడు. ఆర్థిక మంత్రి స్పందించరు. బినావి•ని కాపాడుకునే బాధ్యత వారిపై ఉంది కాబట్టి స్పందించడం లేదని కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు ఇచ్చి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. అవినీతికి పాల్పడే అదానీ వి•ద ఏ కేసు ఉండదు. అదానీకి చెందిన ముంద్రా పోర్ట్‌లో 21 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్‌ ‌దొరికితే కేసు కాలేదు. అదానీని విచారించే దమ్ము దర్యాప్తు సంస్థలకు ఉందా..? అని కేటీఆర్‌ ‌నిలదీశారు. బీజేపీలో చేరగానే కేసులన్ని ఏమై పోతున్నాయని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ ‌బీజేపీలో చేరగానే కేసులన్ని మాయమై పోయాయి. సుజనా చౌదరిపై 6 వేల కోట్ల కేసు ఏమైంది. ఈ దేశంలో ఏం జరుగుతుంది. అదానీపై శ్రీలంక ఆరోపణలపై మోదీ సమాధానం చెప్పాలి. బీబీసీ వి•ద దాడి చేసిన వ్యక్తి.. వి•రేంత అని ఇండియా వి•డియాపై మోదీ అహంకారం ప్రదర్శిస్తున్నారు. జీ టూ జీ అంటే గవర్నమెంట్‌ ‌టూ గవర్నమెంట్‌ ‌కాదు.. గౌతం అదానీ టూ గొటబాయ డీల్‌ అని శ్రీలంక ప్రతినిధి అన్నారని కేటీఆర్‌ ‌తెలిపారు.

2014 తర్వాత ప్రతిపక్షాలపై 5,422 ఈడీ కేసులు నమోదు అయ్యాయ అని కేటీఆర్‌ ‌తెలిపారు. 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదే మోదీ ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్‌ ‌వి•ద 24, టీఎంసీ 19, ఎన్సీపీ 11, శివసేన ఉద్ధవ్‌ ‌థాక్రే 8 కేసులు నమోదు అయ్యాయి. డీఎంకే 6, బీజేడీ వి•ద 6 ఈడీ కేసులు నమోదు అయ్యాయని వివరించారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై ఎలాంటి కేసులు నమోదు కాదు. నేను బీజేపీ ఎంపీనని ఒకాయన డైరెక్ట్ ‌కామెంట్‌ ‌చేశాడు. తనపై ఈడీ దాడులు జరగవని స్పష్టం చేశారు. 8 ఏండ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట వాస్తవం కాదా..? పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా..? డబుల్‌ ఇం‌జిన్‌ అం‌టే దేశానికి అర్థమైంది. ఒక ఇంజిన్‌ ‌మోదీ, ఇంకో ఇంజిన్‌ అదానీ. అడ్డమైన దొంగ సొమ్ముతో ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చి, లొంగని వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయించాలనేదే పనిగా పెట్టుకున్నారు. మునుగోడులో ఒక వ్యక్తికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది వాస్తవం కాదా.. దీనిపై ఇప్పటి వరకు జవాబు చెప్పే దమ్ము బీజేపీ నాయకుడికి ఉందా..? విదేశాల్లో బొగ్గును ఎందుకు కొనాలి.. అని సీఎం కేసీఆర్‌, ‌యూపీ సీఎం కేంద్రాన్ని అడిగితే ఇంత వరకు స్పందన లేదు. కర్ణాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని పత్రికలు చెబుతున్నాయి. మోదీ అదానీ స్నేహం గురించి అందరికీ తెలుసు అని కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *