విజయవాడ, జూలై 1 : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు.
దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజులపాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు.. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు పంపిణీ చేయనున్నారు.



