ఇంతేనా ?

ఇంతగా చదివిన
ఇన్నాళ్ళకు గానీ జీవితానికి తెలియలేదు
లోకమనే  పుస్తకాన్ని చదివి
పరీక్ష వ్రాయాలని ..
ఎవరిని అడిగినా
జవాబు రాని ప్రశ్నలను
ఒకరిని కాఫీ కొట్టడానికి
వీలుకాని పోటీ ఒకటి ఉంటుందని

విధి ఫలితాల్లో
ఓటమిని చదువుకుంటూ
మధ్య మధ్యలో గెలుపు
బరువుగా మోయడం ఉంటుందని

ఊహల అందం చేసే
మోసం ఒంటరితనంతో
ఇంతేగా బ్రతుకని
ఇప్పటిదాకా  తెలియదు…
-చందలూరి నారాయణరావు
9704437247 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *