ఎల్బీనగర్, ప్రజాతంత్ర, జనవరి 3: శ్రీరాముల వారికి పూజలు చేసిన అక్షింతలను వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షుడు కుట్ల నరసింహ యాదవ్ బుధవారం శ్రీకృష్ణ నగర్ కాలనీలో ఇంటింటికి వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువుల కల అని అన్నారు. శ్రీరామ అక్షింతలు నెత్తిపై చల్లుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు రాత్రి ప్రతి ఇంటి ముందర 5 దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, అంజయ్య, వెంకటేష్, ఉపేందర్ రెడ్డి, యాదగిరి రావు, కైలాష్, లింగం యాదవ్, సత్యం, కిషోర్, ఆశిష్ రెడ్డి, రాజు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు





