ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

   శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 9: ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, మార్తాండ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బి ఆర్ ఎస్ మేనిఫెస్టోను , శేర్లింగంపల్లి లో తాను చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పనులను ప్రజలకువివరిస్తూ తనకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా ఏమైనా ఉన్న సమస్యల ఉన్నట్లయితే మళ్లీ గెలిపిస్తే మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *