ఇంటింటా ప్రచారం నిర్వహించిన మహమూద్ అలీ

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే మెరుగైన విద్య వైద్యానికి పెద్దపీట వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కో-కన్వీనర్, న్యాయవాది మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మహమూద్ అలీ నేతృత్వంలో శ్రీరామ్‌నగర్, యూసుఫ్‌గూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. త్వరలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని లక్ష ఇళ్లకు చేరుకుంటామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఆప్ ని ఎందుకు ప్రోత్సహించాలి? ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా ఆసుపత్రులలో అనారోగ్యానికి అయ్యే మొత్తం ఖర్చుకు ఆప్ హామీ ఇవ్వగలదన్నారు. ప్రైవేట్ విద్యతో సమానంగా నాణ్యమైన విద్య, ఉపాధి హామీ ఇవ్వబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అనమ్ అలీ, ఫర్హీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *