ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 26: చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ,న్యాలట, రామన్నగూడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్‌లు రహీమా బేగం,లక్ష్మి, లావణ్యతో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని,ఆయన పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని,వారి మాయమాటలు ప్రజలు నమ్మవద్దని సూచించారు.గతంలో పాలించిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని మరిచాయని,వారికి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు. కర్ణాటకలో రైతులు కరెంట్ కోసం కొట్లాడుతున్నారని, 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. ప్రజలే నిర్ణయించుకోవాలని గుర్తు చేశారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని,సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు నాంది పలుకుతాయన్నారు.ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, గ్రామాల్లో గతానికి, ప్రస్తుతమున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు.తనను భారీ మెజార్టీతో గెలింపించి కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ ప్రసాద్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్,బీఆర్ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి,బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి,రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి,సర్పంచ్‌లు శేరి స్వర్ణలతాదర్శన్,జహంగీర్, మాణిక్యరెడ్డి,వెంకటేశం గుప్తా, విజయలక్ష్మినర్సింలు,మైనార్టీ జిల్లా నాయకుడు అలీ,బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని,బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, బీఆర్ఎస్ నాయకులు వంగ శ్రీధర్‌రెడ్డి,శేరి రాజు,శేరి శ్రీనివాస్, సాయినాథ్,బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా




