కాలం..
చిత్రమైనది
విచిత్రమైనది
ఎందుకంటే
ఎవరినీ ఆపదు
ఎవరికోసమో ఆగదు
అన్నింటినీ మోసుకుపోతూ..
అందరినీ లాక్కుపోతూ..
ప్రతి దానినీ ఏకం చేస్తూ..
ఋతువులను మార్చుకుంటూ..
చరిత్ర వైపు అడుగులు వేసుకుంటూ..
గతకాలపు మరకలను
అంటించుకుంటూ..
బూజు పట్టిన పాత లోకంలోనికి
మెల్లగా జారుకుంటుంది!
అయినా నేటి ఈ క్షణం
కొంతకాలం తర్వాత చరిత్రే కదా!
అందుకే చరిత్ర నేర్పిన పాఠాలతో
భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ..
శాంతియుత,బాధ్యతాయుత
జీవనం కోసం!!
– ఏడుకొండలు కళ్ళేపల్లి,
మచిలీపట్నం
9490832338




