ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి పాలమూరు విష్ణు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి” ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం కుదుటపడేందుకు తన అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు చేసిన ప్రార్థనలు పూజలపై పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శతకోటి వందనాలు అంటూ వీడియో మెసేజ్ ప్రజలకు అందించారు. గత మూడు రోజుల క్రితం నందిగామ ప్రచారంలో అస్వస్థత గురైన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి స్వల్ప గుండెపోటు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే 40 శాతం గుండె నాళాలు బ్లాక్ అయ్యాయని వైద్యులు రిపోర్ట్ అందించారని ఆయన సతీమణి రమాదేవి మీడియా సమావేశంలో చెప్పారు. కచ్చితంగా స్టంట్ వేసుకోవాలని వైద్యులు ఇచ్చిన సలహా నిరాకరించినట్టు ఆయన కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండడంతో తిరిగి ప్రచారంలో పాల్గొనేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చేసినట్టు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.చౌదరిగుడకు ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం హాజరు కానునట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన పార్టీలకు దీటుగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రచార రంగ రంగంలో మరోసారి హాజరు అవుతుండడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు కేరింతలు సంతోషం పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *